వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు ఆట స్టార్ట్ కాగానే ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఈ క్రమంలోనే అతడు డెబ్యూ టెస్టులో 150 మార్క్ ను అందుకున్న ఐదో అతి చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా పాక్ మాజీ క్రికెటర్ జావిద్ మియాందాద్ ఉన్నారు.
Read Also: Meenakshi Chaudhary: ఊదా పువ్వు రెక్కలపై వర్ణం… ఎన్నో చేరనీ కన్నె గగనం!
మియాందాద్.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్ మ్యాచ్ లో 150 పరుగులు చేశాడు. అతని తర్వాత ఆసీస్ ఆర్కీ జాక్సన్ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్ డౌగ్ వాల్టర్స్ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) ఉన్నారు. వీరి తర్వాత అత్యంత పిన్న వయసులో 150 పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
Read Also: Sunny Leone: నా భర్త నన్ను మోసం చేశాడు.. అర్ధరాత్రి ఆ పని చేస్తూ
ఇదిలా ఉంటే, మూడో రోజు ఆట ప్రారంభం కాగానే జేసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో బౌండరీ, సింగిల్ కొట్టిన జైస్వాల్ 150 పరుగుల మార్క్ కు చేరుకున్నాడు. 359 బంతుల్లో అతను 150 పరుగులు చేశాడు. 121 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 330 పరుగులకు రెండు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (156)కి జతగా విరాట్ కోహ్లీ (41) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (5/60), జడేజా (3/26) వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ శతకం కొట్టగా.. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు.