వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేశాడు. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ ను తీసుకున్నాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ నిలిచాడు. కాగా దాదాపు ఏడాది నుంచి టీమిండియాకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. అయితే రెండో టెస్టుకు ముందు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యింది.
Read Also: TTD Online Tickets : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. రేపు అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల
అయితే, టీమిండియా తరపున తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ లో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. హలో అమ్మా.. నీ ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో ముకేశ్ తెలిపాడు. దీంతో ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్‌లో మరింత ఎదిగాలి అని దీవెనలు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.
Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ముఖేష్ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. 2018-19 రంజీ సీజన్‌లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆ సీజన్‌లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు తీసుకుని.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ముకేశ్ కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికయ్యాడు.
No Dream Too Small! 🫡
Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2
— BCCI (@BCCI) July 21, 2023