పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.బయటకు రాలేకే మృతిచెందారు. ప్రమాదంలో వెంటనే…
అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64, 445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతినెలా పాల ప్యాకెట్లను ప్రస్తుతం…
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేయలేమని ఏపీ పెట్రోలియం ట్యాంక్ ఆపరేటర్స్ అసోషియన్ అధ్యక్షడు వై.వి ఈశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు 125 ట్రక్కుల ద్వారా 160 బంకులకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వేసిందన్నారు. ఈ టెండర్లలో పశ్చిమ, తూర్పు గోదావరి నుంచి ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనలేదని ఆయన…
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులకు వైద్య సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. మలేరియా డెంగ్యూ పరీక్షలు కిట్స్ లేవన్న వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహించారు గ్రామస్తులు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధి తో నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైన మరో 50 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.వరుస మరణాల నేపథ్యంలో పాఠశాలను బలవంతంగా మూయించారు తల్లిదండ్రులు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపూర్ పర్యటన వాయిదా పడింది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయిందని, నరసాపురం సభ వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ వాయిదాపడింది. ఈ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయి, ప్రాణ నష్టం, పంట…
అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తుంది. ఆ ఊళ్లో మాత్రం ఇప్పుడే వచ్చింది. కొబ్బరి తోటల్లో బరులు కట్టించి.. జోరుగా పందాలు మొదలెట్టారు. ఊరి ప్రెసిడెంట్‌గారు దగ్గరుండి మరీ బెట్టింగులు పెట్టించారు. తోటల్లో మేళం సంగతిని లేటుగా తెలుసుకున్న పోలీసులు, రైడింగులు కూడా చేశారు. అసలు విషయం ఏంటంటే.. బరుల దగ్గర అరెస్టైన వాళ్లు.. స్టేషన్‌కు వచ్చే సరికి గాయబ్ అయ్యారు. ఎందుకిలా? అని ఆరాతీస్తే తెలిసింది. ప్రెసిడెంట్‌గారు అధికారపార్టీ ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ అని. ఇంతకీ ఆ…
సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. థియేటర్ల రేట్లు, ఆన్‌లైన్ విధానంపై మంత్రి వారితో చర్చించనున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై థియేటర్ యజమానుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి సమావేశమై థియేటర్ల ఓపెన్, ప్రస్తుత విధానం నుంచి ఆన్ లైన్ విధానానికి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే…
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి చెక్ పెట్టే పనిలో పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలో టీడీపి జనసేన మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఆచంట నియోజకవర్గంలో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని, దానిని సరి చేసేందుకు పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల్లో పెనుగొండ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. వైస్సార్సీపీ పార్టీకి చెక్ పెట్టడానికి.. ప్రజా…
సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. తెలుగు సంప్రదాయంలో భాగంగా కోడి పందేలకు అనుమతులు ఇచ్చినా, తెరవెనుక కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది వందల సంఖ్యలో కోళ్లను, కోట్ల రూపాయల నగదులు, అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఏడాది తిరిగేసరికి షరామామూలే. Read: ఆ కారిడార్‌పై చైనా కన్ను… అదే జరిగితే… అయితే, ఈసారి సంక్రాంతి పండుగ రాకముందే కొన్ని ప్రాంతాల్లో కోళ్ల పందేలు మొదలయ్యాయి.…
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న…