పశ్చిమగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని, భయపడవద్దన్నారు. ఈ నెల 21 న ఏలూరు రూరల్ పత్తి కోళ్ల లంకలో కువైట్ నుండి వచ్చిన 41 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు ఇది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని కలెక్టర్ చెప్పారు. గత…
ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంకి ప్రజలు చరమగీతం పాడాలన్నారు. చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేసాం అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. 45 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసాం అని ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం కి పరిపాలనా యోగ్యత లేదు. ప్రజా వ్యతిరేక ఓట్లు విడిపోకుండా పార్టీలు ఏకం కావాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాలు ఏకం కావాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి…
రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి అనంతరం…
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి…
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది.. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, తొమ్మిది మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు.. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.. అయితే, ఆ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. Read…
ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో 10 మంది నీట మునిగి మృతిచెందగా… 30 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదానికి కారణం కచ్చితంగా తెలియకున్నా.. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించపోయి బస్సు వాగులో పడిందంటున్నారు అందులోని ప్రయాణికుడు.…
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులకు రెండున్నర లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీవీతో ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి మాట్లాడారు. బస్సు ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం అన్నారు. డ్రైవర్ హెల్త్ కండిషన్, బస్సులో లోపాలున్నాయన్న దానిపై కమిటీ విచారణ జరుపుతుందన్నారు. గ్యారేజి నుంచి…
పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బైక్‌ని తప్పించబోయి.. వంతెన రెయిలింగ్‌ను ఢీకొంది బస్సు.ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాదంపై సీఎం జగన్,…
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. బస్సు ప్రమాద ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నాం అన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు 20 మీటర్ల దూరం నుండి అదుపు తప్పింది అంటున్నారు. బస్సులో 47 మంది ఉన్నారు. 9 మంది చనిపోయారు. డ్రైవర్ కి హార్ట్ స్ట్రోక్ అని ప్రచారం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే వాస్తవాలు తెలుస్తాయన్నారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని…