Dwakra Group Women: డ్వాక్రా సంఘం గ్రూపులో లోన్ తీసుకున్న మహిళలు.. నెలవారీగా వాయిదాలు చెల్లిస్తూ వస్తుంటారు.. అయితే, ఆ లోన్ సొమ్ములు బ్యాంక్ లో జమచేయకుండా ఓ మహిళ తానే వాడుకుంది.. ఈ విషయం కాస్తా గ్రూపులోని మహిళలకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.. చివరకు ఆమెను పట్టుకుని స్తంభానికి కట్టేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో దారుణం చోటు చేసుకుంది. డ్వాక్రా…
దేశంలో బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడిన మహానుభావుల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఉంటారు. 1897 జూలై 4న విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అయితే చిన్నతనంలోనే ఆధ్యాత్మికతకు ఆకర్షితుడు అయ్యి ఆయన చదువు మానేసి సన్యాసిగా మారి పశ్చిమగోదావరి జిల్లా అడవుల్లో నివసించేవారు. అడవుల్లో జీవనం సాగించే సమయంలోనే బ్రిటీష్ వారి అటవీ చట్టాల ద్వారా గిరిజనులపై జరుగుతున్న దాడులను అల్లూరి తన కళ్లారా చూశారు. దీంతో గిరిజనుల కష్టాలను తొలగించాలని ఏకంగా బ్రిటీష్ వారిపైనే సమరానికి…
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో…
సీఎం జగన్ పోలవరం పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేసినట్లు కనిపించారు. ఏకంగా మంత్రుల వాహనాలను పోలీసులు ఆపడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో మంత్రి పేర్ని నాని కూడా సీఎంతో కలిసి వెళ్లారు. అయితే పోలీసులు మంత్రి కారు అడ్డంగా ఉందని.. దానిని పక్కకు తీయాలని చెప్పడంతో మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ‘నేను ఎవరో తెలుసా? నా డిసిగ్నేషన్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఈ నెల 18న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీరియస్ అయ్యారు. సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి, విద్వేషాలు రగిలించారని నల్లజర్ల వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండెపు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అయ్యన్నపాత్రుడిపై సెక్షన్ 506,…
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల…