Dwakra Group Women: డ్వాక్రా గ్రూప్ డబ్బులు నొక్కేసిన మహిళ..! స్తంభానికి కట్టేసి ఏం చేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dwakra Group Women: డ్వాక్రా సంఘం గ్రూపులో లోన్ తీసుకున్న మహిళలు.. నెలవారీగా వాయిదాలు చెల్లిస్తూ వస్తుంటారు.. అయితే, ఆ లోన్ సొమ్ములు బ్యాంక్ లో జమచేయకుండా ఓ మహిళ తానే వాడుకుంది.. ఈ విషయం కాస్తా గ్రూపులోని మహిళలకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.. చివరకు ఆమెను పట్టుకుని స్తంభానికి కట్టేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో దారుణం చోటు చేసుకుంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధించిన సొమ్మును గ్రూపులోని నిద్ర పావని అనే మహిళ బ్యాంకుకి కట్టకుండా సొంత అవసరాలకు వాడుకుంది. గ్రూపులోని పదిమంది సభ్యులకు సంబంధించి సుమారు మూడు లక్షల రూపాయల వరకు పావని బ్యాంకుకు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతోంది. ఈరోజు గ్రామానికి పావని రావడంతో డ్వాక్రా మహిళలందరూ ఆమెను నిలదీశారు. తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పట్టు పట్టడంతో పావని అందుకు సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన గ్రూపు మహిళలు పావనిని స్తంభానికి కట్టేసి తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పావని భర్త ఆమెను విడిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో, బాధిత మహిళలు అతనితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గ్రూప్ సభ్యుల డబ్బులు తీసుకుని సమాధానం చెప్పకుండా తిరుగుతున్న పావని తనపై తోటిసభ్యులు దాడి చేశారంటూ ఆస్పత్రిలో చేరింది.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు