Fraud: ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు ఇస్తే కమీషన్..! బ్యాంకు నోటీసులు చూసి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మోసాలు ఓవైపు.. సైబర్ నేరాలు మరోవైపు.. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మి ఏదైనా చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.. తాజాగా, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు ఇస్తే కమిషన్ ఇస్తానంటూ ఎరవేసి వారి పేరుపై కోట్ల రూపాయల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి పేద ప్రజలను నిలువునా ముంచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెలుగు చూసింది. తమ పేరుపై ఉన్న లక్షలాది రూపాయలు అప్పులు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో మోసపోయామని గుర్తించి ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు బాధితులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం సోనోవిజన్ లో పనిచేసే రత్నాకర్ అనే వ్యక్తి అమాయకులను టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. పేద ప్రజల నుండి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనిపించిన సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్ వారికి వస్తువులు ఇవ్వకుండా కమిషన్ రూపంలో కొంత నగదు చేతిలో పెట్టేవాడు. ఒకరికి తెలీకుండా మరొకరి దగ్గర ఇలా వందలమంది పేరుతో వస్తువులు కొనుగోలు చేసిన రత్నాకర్ వాటిని బయట అమ్ముకుని సొమ్ము కూడబెట్టుకున్నాడు. తమ బ్యాంకు వివరాలు ఇచ్చి కమిషన్ తీసుకున్న వారికి అనుమానం రాకుండా మొదటి ఈఎంఐ చెల్లించేవాడు. ఇలా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది మంది నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు మోసానికి పాల్పడిన రత్నాకర్ తర్వాతి కాలంలో వాయిదాలు చెల్లించడం మానేశాడు. వాయిదాలు చెల్లించాలంటూ ఆధార్ పాన్ కార్డులు ఇచ్చిన వ్యక్తులకు మెసేజ్‌లు వెళ్లడంతో మోసం పోయామని గుర్తించిన బాధితులకు తర్వాత కాలంలో ఫైనాన్స్ ఉద్యోగుల వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేక అత్తిలి చెందిన బాధితులు ఆత్మహత్యకు సైతం ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సోనోవిజన్ ఉద్యోగి రత్నాకర్ చేసిన మోసాలపై అత్తిలి పోలీస్ స్టేషన్ లో జీరో FIR నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘరానా మోసానికి పాల్పడిన రత్నకరపై సోనోవిజన్ సంస్థ సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!