Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు గ్రామ మాజీ సర్పంచ్ బండి వెంకన్నదే బాధ్యత అని, మల్లేపల్లి గ్రామం చాలా మంచి గ్రామం అందుకే కలెక్టర్ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారని, ఖమ్మం జిల్లా అన్ని సంక్షేమ పథకాల అమలు అధికారులు బాగా చేస్తున్నారని సీఎం దగ్గర ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తె అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని రాజ్యం తీసుకుని వచ్చారని, ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ప్రభుత్వం వద్ధ రూపాయ్ లేదు, సీఎం ఇచ్చిన నిధులతో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారని, సీఎం ఆరోగ్య శ్రీ ఖర్చు ను కూడ పెంచారన్నారు. ఈ రోజు పవిత్రమైన రోజు, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దేశానికి ఇచ్చిన రోజు అని, 1300 కోట్లు ఆర్టీసీ కి ఇచ్చాం, గ్యాస్ 500 కే అందిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
Best 5G smartphones: రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
అంతేకాకుండా..’గత ప్రభుత్వం మాదిరిగా రైతులవి వడ్డీలు వడ్డీలు పెరిగిపోతాయి అని సీఎం కు చెప్తే విడతల వారిగా రైతు రుణ మాఫీ చేస్తున్నాం.. కుంట ఉన్న రైతు కి కూడ రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం, రేపు బ్యాంక్ లకు వెళ్లి డబ్బు తీసుకోండి.. 4,5 రోజుల్లో కేబినెట్ వేసి నిన్నటివరకు వచ్చిన దరఖాస్తులను కూడ చెక్ చేసి అమలు చేస్తాం.. శాసనసభ్యుడికి 3500 ఇల్లు ఇస్తాం, ఇల్లు సరిగ్గా లేని పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇస్తాం.. అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి, గుడిసెల్లో లేకుండా చేస్తాం.. ఉపాధి హామీలో పని చేసే భూమి లేని వారికి 12 వేలు ఇస్తున్నాం, మొదట 6 వేలు ఇచ్చి రెండవ విడతలో మరో 6 వేలు ఇస్తాం.. రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఎవరికి ఇవ్వలేదు, అధికారులు ఇంటింటి సర్వే చేసి రేషన్ కార్డులు ఇస్తున్నాం.. రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం ఇస్తాం, దొడ్డు బియ్యం ఇస్తే అవి అటునుండి అటే దళారుల చేతికి వెళ్తుంది.. సన్న ధాన్యం పండించిన రైతుకి 500 బోనస్ ఇచ్చాం.. మొన్న ఓ రైతు చెప్తున్నాడు తనకు అస్సలు కంటే బోనస్ అధికంగా 3 లక్షలు వచ్చాయని చెప్పాడు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఏ బియ్యం తింటున్నారో అవే బియ్యం రేషన్ కార్డు దారులకు ఇస్తాం.. రెండు మూడు రోజుల్లో నిన్న మొన్న వచ్చిన దరఖాస్తులు వెరిఫై చేస్తాం.. మొన్న పేర్లు వచ్చిన లిస్ట్ అంతా కూడ దరఖాస్తు చేస్కున్న వారి పేర్లే.. ఎవరు ఏమి చెప్పినా ప్రజలు కంగారు పడకండి, మీ కోసం పని చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.. దేశంలో ప్రజల సంక్షేమ పథకాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం..
ఏ కుటుంబం కూడ బజారున పడకూడదని, పంటకు భీమా కడుతున్నం.. కొణిజర్ల లో పామాయిల్ ఫ్యాక్టరీ కడుతున్నమ్, రఘునాథపాలెం రైతులు అక్కడ అమ్ముకోవచ్చు.. పామాయిల్ మొక్కలు ఉచితమే, వాటిని కోసి బండిలో వేయడమే మీ ఖర్చు.. రేపటినుండి మొక్కలు వేయడం వెంకన్న బాధ్యత, వారికి నీటిని రప్పించడం నా బాధ్యత.. ఖమ్మం జిల్లా మొత్తం పచ్చగా ఉండేలా చేయడమే నాకు ఇష్టం, దాని కోసం కలెక్టర్ సీఎం తో మాట్లాడారు.. ఈ పంట కాలానికే నీళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం, దానికి మీ భూమి పోదు గాడి వేసి పూడ్చేస్తాం.. మండల రైతాంగం మొత్తం పట్టుబట్టి పని చేపించుకుంటే రెండు మూడు నెలలో నీళ్లు వచ్చేలా చేస్తాం.. మీ పిల్లల విద్యకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం.. ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే రఘునాదపాలెం మండలంలో ఉన్నారు అని చెప్పుకునేలా ఉండాలి.. ఈ మండలం ఖమ్మం నగరానికి ఆదర్శ మండలంగా ఉండేలా చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Republic Day: భారత్‌కి పుతిన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..