CM Chandrababu: అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒకప్పుడు వ్యవసాయానికి పంజాబ్ ఎంతో ప్రసిద్ధి చెందింది.. పురుగుమందులు విచ్చలవిడిగా వాడడం వల్ల అక్కడ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.. చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.. రాబోయే రోజుల్లో క్యాన్సర్ విస్తృతం కానుంది.. ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తం కావాలి.. ఎరువులు వేయకుండా పాత పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాలను ప్రోత్సహిస్తున్నాను.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహిస్తాం.. చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలను చేపడుతున్నాం.. పేపర్లు . బాటిళ్లను రీసైక్లింగ్ చేసే విధానాలను తీసుకువస్తున్నాం.. కందుకూర్‌లో 25 టన్నుల టన్నుల చెత్తను రీ సైక్లింగ్ చేసే ప్రక్రియను ఈరోజు ప్రారంభించడం అభినందనీయం అన్నారు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను సర్పంచులు తీసుకోవాలి.. కంపోస్ట్ తయారు చేసేందుకు షెడ్లు కూడా నిర్మించాం.. గ్రామాల్లో చెత్త పేరు కోకుండా సర్పంచులు చూసుకోవాలి.. ఏ సర్పంచ్ బాగా చేస్తే వారిని ప్రోత్సహిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. మున్సిపాలిటీలలో మునిసిపల్ చైర్మన్ లపై ఆ బాధ్యత ఉంటుంది.. అందరికీ ర్యాంకులు ఇస్తాం.. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ చేసే వరకూ కార్యక్రమాలను కొనసాగిస్తాం.. 30 ఏళ్ల ముందు నేను డ్రిప్ ఇర్రిగేషన్ పెడితే అందరూ ఎగతాళి చేశారు.. ఇప్పుడు అది సర్వసాధారణమైంది.. గతంలో ఐ.టీ. గురించి మాట్లాడా.. ఇప్పుడు ఏ.ఐ. గురించి మాట్లాడుతున్నా.. గతంలో ఉద్యోగాలు చేయమని చెప్పా.. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుతున్నాను అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి.. గతంలో అందరూ రాగిసంగటి తినేవారు.. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం తీసుకువచ్చారు.. ఇప్పుడు తృణ ధాన్యాలపై ప్రజల ఆసక్తిని చెబుతున్నారు.. రైతులలో కూడా మార్పు రావాలి.. ప్రజల అవసరాలకు అనువైన పంటలను పండించాలని సూచించారు.
Read Also: Film Industry : రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..
ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం కింద ఇంటి వద్ద విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.. పేదరికం లేని సమాజాన్ని సాధించేందుకు అండగా ఉంటా.. పి 4 విధానాన్ని తీసుకువస్తున్నాం.. స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతాం అన్నారు చంద్రబాబు.. పొదుపు సంఘాలు పెట్టినప్పుడు కొందరు ఎగతాళి చేశారు.. ఆరోజు వేసిన విత్తనం ఈరోజు ఎంత ఎదిగిందో అందరూ చూస్తున్నారు.. గ్రామాల్లో డైరీ పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలి.. ప్రస్తుతం జనాభా పెరగాల్సిన అవసరం ఉంది.. దీనిని బాధ్యతగా తీసుకోవాలి.. కొన్ని దేశాల్లో మనుషుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ ప్రాంతానికి నీటి సమస్య ఉండేది కాదు.. నదుల అనుసంధానాన్ని కూడా చేస్తాం.. విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు సోలార్ ..విండ్ ఎనర్జీని తీసుకువస్తున్నాం.. ప్రపంచంలోనే ఉత్తమ విధానాలను తీసుకువచ్చి అమలు చేస్తాం.. కందుకూరి ప్రాంతంలో 18వందల ఎకరాలను గర్భకండ్రిగ కింద పెట్టారు.. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తాం.. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసింది.. స్వచ్ఛభారత్ కింద ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా ఖర్చుపెట్టలేదన్నారు..