Imposes Limit on Gold Jewelry: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. ఆల్ టైం హై రికార్డులు సృష్టించి.. మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది.. అయితే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు.. కొనుగోలు చేసేవారు లేకపోలేదు.. మరోవైపు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు.. కొందరు ఎక్కువ బంగారం నగలు పెట్టుకొని వస్తే.. మరికొందరు.. వారి స్థాయికి తగ్గట్టు.. కొన్ని నగలే పెట్టుకుంటారు.. అయితే, ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ జిల్లాలోని రెండు గ్రామాల్లో వింత…
ఇది కలియుగం. ప్రస్తుతం సాధారణ పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. అలాగే ఓ జంట తమ పెళ్లిని విభిన్నంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించింది. వెడ్డింగ్ కార్డ్‌ను ఆకర్శణీయంగా మలచింది. పెళ్లి పత్రికను మొదటిసారి చూసినప్పుడు ఓ ఆధార్ కార్డులా కనిపించింది. అయితే తర్వాత సరిగ్గా చూసేసరికి అది పెళ్లి కార్డు అని తెలిసింది.
పెళ్లంటే.. హిందూ సంప్రదాయంలో ఓఅపురూప వేడుక. చేతిలో డబ్బులుండొచ్చు... లేకపోవచ్చు.. అప్పు చేసైనా ఆ జీవితకాల ఆనందాన్ని సొంతం చేసుకోవాలని వధూవరుల తల్లితండ్రులు, కుటుంబసభ్యులు భావిస్తారు. అందుకే వీలైనంత ఘనంగా కల్యాణ వేడుకలు జరుపుతారు.
PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు…
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న…
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న రాజస్థాన్‌లో పోలింగ్ జరగనుంది. అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి కావడం గమనార్హం. అంటే ఆ రోజు రాష్ట్రంలో 50,000 కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉంది.
Record-Low Weddings: ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయస్సులో జరిగితేనే బాగుటుందని పెద్దలు చెబుతుంటారు.. అయితే, ఇది క్రమంగా గాడి తప్పుతుందేమో అనిపిస్తోంది.. పెళ్లిని క్రమంగా వాయిదా వేస్తున్నారు నేటి యువతి.. ఉద్యోగం, సెటిల్‌మెంట్.. ఇలా చూస్తూ.. పెళ్లికి కామాలు పెడుతూ పోతున్నారు. కొన్ని దేశాల్లో మరీ ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాపులేషన్ భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా,…
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక బ్లాక్‌లో ముస్లిం వివాహాలలో నృత్యం, సంగీతం, బాణసంచా కాల్చడాన్ని మతాధికారులు నిషేధించారు. డిసెంబర్ 2 నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ సోమవారం తెలిపారు.
దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి బొనాంజా తర్వాత వ్యాపారులకు భారీ బొనాంజా తగలనుంది. దేశంలో ఈ నెల 4న మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని, ఈ సీజన్‌లో మొత్తంగా 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది.
కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇక అంతేకాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30)…