Work From Home: తమ రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.…