నిన్నటి తెలంగాణ & పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడినవి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశ నుండి తెలంగాణా రాష్ట్రం లోనికి వస్తున్నవి. ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో రేపు కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణ హెచ్చరికలు:- రేపు, ఎల్లుండి భారీ వర్షములు…
ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టాము నుండి 4.5 కిమి వరకు వ్యాపించి ఉన్నది. మరొక ఆవర్తనం ఉత్తర ఛత్తీస్ గడ్ &పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశాలలో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణ హెచ్చరికలు:- ఈ రోజు భారీ వర్షములు…
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నవి. ఈ రోజు ఉపరితల ద్రోణి ఝార్ఖండ్ నుండి ఒడిస్సా మీదగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5కిమి వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. ఈరోజు భారీ వర్షాలు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణా జిల్లాలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.…
నిన్నటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి ఈ రోజు బలహీన పడింది. అల్పపీడనము ఈరోజు దక్షిణ ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించి, ఎత్తుకు వెల్లే కొలది అల్పపీడనం నుండి నైరుతి దిశగా తెలంగాణా వైపుకి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం. ఈ రోజు (14,వ తేదీ) తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు…
ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఈ నెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ ఒడిస్సా నుండి తెలంగాణా మీదగా గుజరాత్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిమి నుండి 5.8 కిమి వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు (09,10,11వ తేదీలు)తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణహెచ్చరికలు రాగల 3 రోజులు (09,10,11వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులతో…
కేరళ సముద్ర తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి…
ఓ వైపు నైరుతీ రుతుపవనాలు జూన్ 3న కేరళలోకి ప్రవేశిస్తాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎండ తీవ్రత కొనసాగింది. వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధికంగా 35.3 నుంచి 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలి తక్కువగా వీయడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాగా సముద్రం వైపు నుంచి దక్షిణ గాలులు రాష్ట్రం మీదుగా…
నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకోనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్ 3న కేరళను తాకుతాయని చెబుతోంది. రాగల మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు,…
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…
ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ,రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి…