ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఈ నెల 11వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ ఒడిస్సా నుండి తెలంగాణా మీదగా గుజరాత్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిమి నుండి 5.8 కిమి వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు (09,10,11వ తేదీలు)తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు
రాగల 3 రోజులు (09,10,11వ.తేదీలు) ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం తెలంగాణాలోని కొన్ని ప్రదేశములలో (ఉత్తర, తూర్పు జిల్లాలలో) వచ్చే అవకాశములు ఉన్నాయి.
11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షములు వచ్చే అవకాశములు ఉన్నాయి. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు 12,13 తేదీలలో కొన్ని ప్రదేశాలలో అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.