దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక , దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ఈ రోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమలోనూ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.