ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు మరియు పొరుగున ప్రాంతాల్లో ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రం, అమరావతి వెల్లడించింది.. దీని ప్రభావంతో.. రాబోయి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: SC Cell President Preetham: టీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియ యానాంలో ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశాలున్నాయని.. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవిస్తాయని.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది వాతావరణశాఖ.
ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని.. ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంతో పాటు.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.. మరోవైపు.. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల,.. ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.