Heavy Rain: హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
Read Also: Chirla Jaggireddy: అవినీతి గిన్నిస్ బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయి..!
అలాగే, అబ్దుల్లాపూర్ మెట్, మల్కాజిగిరి, నేరేడుమెట్, చదర్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్, మదన్న పేట్, బోయిన్ పల్లి, ప్యారడైజ్, ఖర్ఖానా, మారేడుపల్లి, మెట్టుగూడ, చిలకలగూడ, సీతాఫల్ మండి, పార్సీగుట్ట, గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ రైలే స్టేషన్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వాన ప్రభావంతో రోడ్ల మీదకు భారీగా వర్షం నీరు చేరడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. వరదతో ప్రమాయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం పడుతుండటంతో ప్రజలు ఎవరు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హెచ్చరించారు. మరోవైపు, తెలంగాణలోని సంగారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, రంగారెడ్డి, మేడ్చల్, వనపర్తి, వికారాబాద్, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లు పేర్కొన్నారు.