Weather Update: తీరం దాటిన వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో వర్ష సూచనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్‌గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగనున్నట్లు కూడా హెచ్చరిక జారీ చేశారు.
Read Also: Tirumala Darshanam: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం..!
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
సముద్రంలో గాలుల వేగం పెరగవచ్చని, కాబట్టి వేటకు వెళ్లే మత్స్యకారులు రెండు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లకూడదని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఇకపోతే, ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత విస్తృతంగా పడే అవకాశం ఉందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇది ఇలా ఉండగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే వర్షలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. అందుకు తగ్గట్టుగా సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
Read Also: Arshdeep Singh: తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన యువ క్రికెటర్..
శుక్రవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,నంద్యాల, వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/uPu8SrZk5i
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 29, 2025
తాజావార్తలు
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!