బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
క్రింది స్థాయి ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తు్న్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణి పేర్కొన్నారు. ఈశాన్య జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ నగరంలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది.
నేడు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారిపోయింది.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని.. విశాఖకు 380 కిలో మీటర్లు, పారాదీప్ కు 480 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలో మీటర్ల దూరంలో కేద్రీకృతం అయిఉన్నట్టు తెలిపింది
Cyclone Tej: తేజ్ తుఫాన్ తీవ్రత తారా స్థాయికి చేరనుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. భారత వాతావరణ కేంద్రం (IMD) సమాచారం ప్రకారం.. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నానికి తేజ్ తుఫాన్ తీవ్రతరంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తేజ్ తుఫాను కారణంగా అతి వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని.. వేచే ఈదురు గాలుల వేగం గంటకు గరిష్టంగా 62 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్లుగా ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.…
Tammy Hurricane: శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌లో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరికేన్ శనివారం పగటిపూట గ్వాడెలోప్ ద్వీపసమూహం సమీపంలో లేదా దాని మీదుగా వెళుతుందని అలానే దీని మార్గం రాత్రి సమయంలో సమీపంలోని సెయింట్-మార్టిన్ మరియు సెయింట్-బార్తెలెమీ దీవుల నుండి దూరం వెళ్లే అవకాశం ఉందని ఫ్రెంచ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షపాతంతో పాటుగా బలమైన గాలులు వీస్తాయని సూచించింది. గంటకు 120 కిలోమీటర్లు…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కొనసాగుతుంది.. తెలంగాణా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు… ఈ క్రమంలో ములుగు, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్…
రెండు వారాలుగా కొనసాగుతున్న డ్రై స్పెల్కు ముగింపు పలుకుతూ తెలంగాణ వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం అంచనా వేసింది.. జూలై చివరి వారంలో అపూర్వమైన అవపాతం తర్వాత, నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఆగస్టు 16 నాటికి, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 117 మి.మీ.కు గాను ఈ నెలలో కేవలం 21 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.. ఫలితంగా 82 శాతం విచలనం నమోదైంది.. గత నెలలో కురిసిన…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనాలు బయట కాలు పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి..లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.. రోడ్లు నదులుగా మారాయి.. ఎటు చూసిన నీళ్లు కనిపిస్తున్నాయి.. ఎక్కడ ఏది ఉందో తెలియక వాహన దారులు ఇక్కట్లు పడుతున్నారు.. ఇక బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై…
తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.. ఈ మేరకు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.. ఇక భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తదితర అన్ని రకాల విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ…