భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ నిప్పులు కక్కుతున్నాడు. ఐఎండీ సూచనల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజులపాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
Summer: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది.
Telangana Weather: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది.
Panchayat Level Weather Forecast from Next Week: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే వారం నుంచి పంచాయతీ స్థాయి వరకు వాతావరణ సూచనలను అందజేయనుంది. అంటే.. ఇక నుంచి ప్రతి గ్రామ ప్రజలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనవరి 15 నుంచి వాతావరణ సమాచారాన్ని బ్లాక్ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరిస్తున్నట్టు ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, హిందీ సహా 12 భారతీయ…
నేటి నుంచి భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు వన్డే మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇవాళ జోహన్నెస్బర్గ్ వేదికగాఇమధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ఆరంభం కాబోతుంది.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.