రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Heavy rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది.
Rains: వేసవి కాలంలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో నమోదు అయ్యే వర్షాల కన్నా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. మార్చి 1 నుంచి మే 3 వరకు సాధారణం కన్నా 28 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయిందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Cyclonic Circulation: భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మే 6 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ మంగళవారం తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్‌కాస్ట్ మోడల్ గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రెంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని తర్వాత ఐఎండీ కూడా…
రానున్న మూడు రోజుల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ హిమాలయ ప్రాంతం, మధ్యప్రదేశ్లో మే 3 వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
రాజధాని నగరం సహా తెలంగాణలోని అన్ని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా.. మరో వైపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.