తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కొనసాగుతుంది.. తెలంగాణా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు…
ఈ క్రమంలో ములుగు, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నల్గొండ జిల్లా, మహబూబాబాద్, భూపాలపల్లి తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. ఈ జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్ ను జారీ చేశారు.. ఈ అల్పపీడన ప్రభావం ఏపీ పై కూడా పడిందని తెలుస్తుంది.. పార్వతీపురం, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..
ఇదిలా ఉండగా.. మరోవైపు హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటి ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగానే ఉన్నాయి. లంగర్ హౌస్, అహ్మద్ నగర్ కాలనీ వాసులు నరకం చూస్తున్నారు. ఇళ్లలోకి వాన నీరు రావడంతో జనాలు రాత్రంతా జాగారాలు చేయాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది. మూసికి వరద ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించడం లేదు. చాదర్‌ఘాట్ కాజ్ వే వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.. రోడ్లు మూసివెయ్యడం తో వాహన దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఈ వర్షాల పై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.. ప్రజలు ఎట్టి పరిస్థితులలోను బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు..