AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా.. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే.. ఉత్తర ఒడిశా.. దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్.. పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అనంతరం అది వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్ తీరంలో కేంద్రీకృతమై.. స్థిరంగా కొనసాగుతుండడంతో రాష్ట్రంలో…