Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్‌లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఇది తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన. రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై 2019 పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజుల తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరించబడింది. లోక్‌సభ సభ్యుడిగా రాహుల్ గాంధీ అనర్హత వేటును రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కేరళ కాంగ్రెస్ ఆయనకు ఘన స్వాగతం పలకనుంది.
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ట్విట్టర్‌లో ఇలా వ్రాస్తూ, “ఆగస్టు 12-13 తేదీలలో రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటిస్తారు. వయనాడ్ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచిందని, వారి గొంతు పార్లమెంటుకు తిరిగి వచ్చిందని ఉప్పొంగిపోతున్నారు. ! రాహుల్ జ కేవలం ఎంపీ మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుడు.” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు పలువురు ప్రతిపక్ష ఎంపీల నుంచి ఘన స్వాగతం లభించింది. గాంధీ వారసుడు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ప్రార్థనలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ నిర్ణయాన్ని స్వాగతించే చర్యగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభివర్ణించారు. రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్‌లోని సూరత్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు ఒకరోజు ముందు ఈ కేసులో రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో గాంధీ మార్చి 24న లోక్‌సభ ఎంపీగా అనర్హుడయ్యాడు. జులై 7న, గుజరాత్ హైకోర్టులో నేరారోపణపై స్టే కోరగా.. రాహుల్ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది, ఆ తర్వాత అతను జులై 15న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.