వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక బుధవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.
Rahul Gandhi : కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ సమాచారాన్ని అందించారు.