Smart TV explode: స్మార్ట్ టీవీ పేలిపోవడం వల్ల ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగింది. బుధవారం ఉదయం 10 కల్పేటలోని అంబిలేరి ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడు సజిత్ తన తమ్ముడు ఇమ్మాన్యుయేల్‌తో కలిసి టీవీ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆకస్మాత్తుగా టీవీ నుంచి మంటలు కనిపించాయని, వెంటనే టీవీ మొత్తం మంటలు అంటుకున్నాయని, తన సోదరుడు టీవీ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించిన సందర్భంలో చేతులు కాలిపోయాయని ఇమ్మాన్యుయేల్ మీడియాకు చెప్పారు. టీవీ తర్వాత పెద్ద శబ్ధంతో పేలిపోయినట్లు చెప్పాడు.
Read Also: India Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్‌లో ఎండిపోయిన చీనాబ్ నది..
టీవీ నుంచి వెలువడిన మంటలు ఇంట్లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో తీవ్ర నష్టం కలిగింది. స్థానిక నివాసితులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. సాజిన్‌కి స్వల్పగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.