కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి…
Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కొనసాగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉంటే… అవి కూడా చేస్తాం. ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల్లో ప్రాజెక్టుపై మరింత…
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక టర్కీ రాజధాని అంకారాలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో కలిసి షెహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..
భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు శనివారం రోజు పరస్పరం చర్చించుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ చర్చల కోసం ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్పుల విరమణ అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కాగా.. ఇప్పుడు అందరూ సింధు నదీ జలాల అంశంపై క్లారిటీ వచ్చింది.
గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని... తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.
KRMB : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ, వృధా కాకుండా సరైన వినియోగం, తాగునీటి ప్రాధాన్యత వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాగునీటికి ప్రాధాన్యం – రెండురాష్ట్రాలకు బోర్డు సూచన KRMB రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని సూచించింది. ప్రజలకు తాగునీరు అందించడమే మొదటి బాధ్యతగా…
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది.…
Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు.