Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు.
ఈరోజు ఉదయం11 గంటలకు కృష్ణానది యాజమాన్య బోర్డ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు, కేఆర్ఎంబీ అధికారులు పాల్గొననున్నారు. మొత్తం 13 అంశాల ఎజెండాగా బోర్డ్ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలకు కృష్ణ బేసిన్ లో నీటి కేటాయింపు, బోర్డుల పరిధి, బోర్డ్ తరలింపు ఇతర అంశాలపై చర్చించనున్నారు కేఆర్ఎంబీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పనుల అంశాన్ని…
త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని…
ప్రగతిభవన్ లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. ఈ సందర్భంగా తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్… పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. read also : ముల్లును ముల్లుతోనే తీయాలనే ప్లాన్‌లో ఎమ్మెల్సీ తోట! కేంద్రం ఖరారు చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైనా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్.…
కేంద్ర గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు సీఎం కెసిఆర్ రానున్నారు. ఈ సందర్బంగా కేంద్ర గెజిట్ పై కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా… కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల…
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం అతిపెద్ద హాట్‌టాపిక్ జల వివాదం. ఎవరి వ్యూహాలు వారివే. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి సహకరించేలా గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది? ఓ కీలక అధికారే అలాంటి గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిస్తే..!? రియాక్షన్ ఊహించలేం. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న ఆ ఆఫీసర్‌ను కంట్రోల్ చేయలేకపోతే కష్టమంటున్నాయి ఏపీ ఇరిగేషన్ వర్గాలు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. జలవివాదంలో పక్క రాష్ట్రానికి గూఢచర్యం? కొందరు అధికారులు అవినీతికి పాల్పడితే.. ఇంకొందరు విధి నిర్వహణలో…
కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించింది.…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివాదం నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయంలో ఏపీ కావాలనే దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ను గుర్తించడం లేదని పర్యావరణ అనుమతులు ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోతల…
ఏపి,తెలంగాణల మధ్య తాజా జలవివాదంలో వివిధ రాజకీయ పార్టీల ఆరోపణలు విచిత్రంగా వుంటున్నాయి. ఒకవైపున తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,శ్రీనివాసగౌడ్ వంటివారు వైఎస్‌రాజశేఖరరెడ్డి తెలంగాణకు రావలసిన నీటిని దోచుకున్నారంటూ దొంగలు రాక్షసుల భాషలో ధ్వజమెత్తారు. దీనిపై జగన్ ప్రభుత్వం నుంచి తీవ్రస్పందన లేదు గనక ఇదంతా మ్యాచ్‌ఫిక్సింగ్ అనీ లాలూచీ అనీ టిడిపినాయకులు ఆరోపించారు.తర్వాత ఎపిప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి వంటివారు స్పందించాక క్యాబినెట్ కూడా నిర్ణయాలు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో మన…