కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో కలిసి షెహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Akhil : అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ..?
కాశ్మీర్ సమస్యను, నీటి సమస్యను.. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్యం, ఉగ్రవాదం నిర్మూలనపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి ప్రయోజనాల కోసం భారత్‌తో శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే.. నిజంగానే వారు శాంతిని కోరుకుంటున్నారని అర్థమవుతుందని షరీఫ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Coronavirus: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. వెయ్యి దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య!
ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయని.. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లో పర్యటిస్తూ.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ పౌరులు శాంతిని కోరుకోకపోతే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవల్సి వస్తుందని చెప్పారు. ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేదంటే బుల్లెట్ దిగుతుందని హెచ్చరించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపివేసింది. అనంతంర మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాళ్లు బేరానికి రావడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.