పార్లమెంట్ ఎన్నికలకు ముందు కర్ణాటక నుంచి అత్యవసరంగా విడుదల చేసిన 2.25 టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది . రాబోయే నీటి ఎద్దడిని ఊహించి, తీవ్రమైన కొరత పరిస్థితులలో ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు మార్చిలో కర్ణాటక ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. తమ అభ్యర్థనకు కర్ణాటక కౌంటర్లు సానుకూలంగా స్పందించి బుధవారం నారాయణపూర్ డ్యాం నుండి నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. కర్ణాటకలో విడుదల చేసిన నీరు 167…
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయని సీబ్ల్యూసీ తెలిపింది.
రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
Water Crisis: వేసవి పూర్తిగా రాకముందే బెంగళూర్ నీటి సంక్షోభంలో చిక్కుకుంది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరంలోని ప్రజలు ఇప్పుడు బకెట్ నీటి కోసం గోస పడుతున్నారు.
Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు.
Water Crisis: వేసవి కాలం పూర్తిగా రాకముందే దేశంలోని పలు నగరాలు నీటి సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇండియా సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది. నగర వాసులకు రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా.. ఇప్పటికే 500 మిలియన్ లీటర్ల కొరత ఉంది. బెంగళూరులో 14,000 బోర్‌వెల్‌లు ఉండగా వాటిలో 6,900 ఎండిపోయాయి. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయా.?? అంటే రిజర్వాయర్లలో నీటి…