హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…
ఆదిలాబాద్ జిల్లా గూడెం వాసులు గుక్కెడు నీటికోసం తిప్పలు పడుతున్నారు..రోడ్డు సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు..ఏళ్లు గడిచినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో గోస పడుతున్నారు ..చివరికి జిల్లా కలెక్టరేట్ కు మొరపెట్టుకోవడం కోసం గూడెం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు..అయినా స్పందించకపోవడం మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు.. ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్ గూడెం ఇది.. గూడెం వాసులకు తాగునీటికోసం తంటాలుపడాల్సిన పరిస్థితి..ఊర్లో బోరు లేదు..పొలాల్లో ఉండే అల్లంతదూరంలోని బావి…