రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
సీబీఎస్‌ఈ (CBSE) విద్యార్థులకు బోర్డు హెచ్చరికలు (Warning) జారీ చేసింది. పరీక్షలు ప్రారంభమవుతున్న వేళ సోషల్ మీడియాలో సీబీఎస్‌ఈ లోగో పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే హ్యాండిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు, టీచర్లకు (Students And Teachers) సూచించింది .
గుడివాడలో రా..! కదలి రా..! కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..?.. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తారా..? నేనేంటో చూపిస్తానంటూ ఆయన పేర్కొన్నారు.
2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాను అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు. కొందరు నాపై సోషల్ మీడియాతో ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళకి 2024 ఎలక్షన్ తర్వాత చూపిస్తా..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే రైస్ మిల్లర్లుపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్‌లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు.