లెబనాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హిజ్బుల్లా లక్ష్యంగా దాడులు తీవ్రం కాబోతున్నాయని.. తక్షణమే సరిహద్దు ప్రజలు ఖాళీ చేయాలని వీడియో ద్వారా నెతన్యాహు సందేశం పంపించారు. గాజాకు పట్టిన గతే హిజ్బుల్లాకు పడుతుందని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.
ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జూనియర్ డాక్టర్లంతా రోడ్లపైనే ఉన్నారు. న్యాయం కోసం గొంతెత్తున్నారు. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సూచంచింది.
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
సునామీ హెచ్చరికలతో జపనీయులు బెంబేలెత్తిపోతున్నారు. రెండ్రోజుల క్రితం 7.1తో భూకంపం సంభవించింది. దీంతో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు
పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు.
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూలై 16 నుంచి ఈనెల 20 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.