Warangal Crime: వరంగల్ లో దారుణం.. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక సమాచారంతో ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా కాజీపేట మండలంలోని ఓ వెంచర్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. ముఖంపై బండ రాయితో మోదీ విచక్షణా రహితంగా హత్యచేశారు గుర్తు తెలియని దుండగులు. బుధవారం సాయంత్రం భట్టుపల్లి, అమ్మవారిపేట మధ్య వెంచర్లో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చెట్ల పొదల్లో రక్తపు మడుగులో యువతి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. అంతే షాక్ తిన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మహిళ ముఖం గుర్తు పట్టలేనంతగా ఆమెను బండరాయితో మోదీ అతిదారుణంగా హత్య చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న సెంట్రల్ డీసీపీ ఎంఏ బారి, కాజీపేట ఏసీపీ తిరుమల్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఎస్సైలు రాజబాబు, దివ్య హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంకా రక్తం తడి ఆరకపోవడం మధ్యాహ్నం తరువాతే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హత్య జరిగిన స్థలంలో బ్యాగు, మహిళ పర్సు, మృతురాలి చెప్పులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also Read
Read also: Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో.. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. మృతురాలు పర్సులో లభించిన ఆధార్ కార్డు బట్టి ఆమెను దర్గాకాజీపేట లోని లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా కుమార్ భార్య లావుడ్యా యామిని అలియాస్ కుమారిగా గుర్తించారు పోలీసులు. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాట్లు గుర్తించారు. అయితే.. ఆమె ఇక్కడకు ఎందుకు వచ్చిందో.. ఎవరు హత్య చేశారో అనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసు కొని అన్ని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే తన భర్త లావుడ్యా కుమార్ భార్య మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు. భర్త లావుడ్యా కుమార్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!