తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున వారి ఓటు వేసేందుకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
ఈ మేరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భోంగీర్ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులను ఆయన జారీ చేశారు.
Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి సాధారణ సెలవు ప్రకటించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో నమోదైన ఓటరుగా ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలు డ్యూటీ లేట్, షిఫ్ట్ సర్దుబాట్లు, డ్యూటీ వేళలు తక్కువగా ఉండటం లేదా ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఇక పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.