Dussehra : ఉర్సు రంగాలీల మైదానంలో అక్టోబర్ 2న జరగబోయే దసరా ఉత్సవాల సందర్భంలో ట్రైసిటీ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ ఆంక్షలు 2025 అక్టోబర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుండి అక్టోబర్ 3 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ తెలిపారు.
భారీ వాహనాల రూట్ మార్పులు
ఖమ్మం నుండి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళే భారీ వాహనాలు ఫున్నెలు క్రాస్ – ఐనవోలు ఆర్చ్ – వెంకటాపురం – కరుణాపురం మార్గంలో ప్రయాణించాలి.
కరీంనగర్ నుండి ఖమ్మం వెళ్లే వాహనాలు కొత్తపేట – ఎనుమముల – లేబర్ కాలనీ – తెలంగాణ జంక్షన్ – ఫోర్ట్ రోడ్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లే వాహనాలు కరుణాపురం – వెంకటాపురం – ఐనవోలు – ఫున్నెలు క్రాస్ మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.
ఉర్సుగుట్టకు వచ్చే వాహనాల పార్కింగ్ సౌకర్యాలు
దసరా ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల వాహనాల కోసం పలు ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
హన్మకొండ హంటర్ రోడ్ నుండి వచ్చే వాహనాలు: కొలంబో హాస్పిటల్, గానుగ ఆయిల్ పాయింట్, ఆకుతోట ఫంక్షన్ హాల్, నాని గార్డెన్, JSM స్కూల్ వద్ద.
కడిపికొండ నుండి వచ్చే వాహనాలు: భారత్ పెట్రోల్ పంపు దగ్గర.
ఆర్టీఓ జంక్షన్ నుండి వచ్చే వాహనాలు: లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కాలేజ్ వద్ద.
కరీమాబాద్ నుండి వచ్చే వాహనాలు: భీరన్న గుడి వద్ద.
పౌరులు, భక్తులు ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించి సహకరించాలని, పోలీసులు సూచించారు.