ఎన్ఐఏ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న కేటుగాళ్ళకు అరదండాలు వేశారు పోలీసులు. జగిత్యాలకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వరంగల్ పోలీసుల అదపులో నిందితులు వున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులను అరెస్ట్ చేసి, ఆ సంస్థను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. చింది. ఈ నేపథ్యంలో ఇందు లో కీలక పాత్ర పోషించిన జాతీయ దర్యాప్తు బృం దం (ఎన్ఎస్ఐఏ) అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఘటన గత నెల 18న జగిత్యాల జిల్లా కేంద్రం లో కలకలం రేపింది. ఈ ఘటన మరవకముందే కొందరు అగంతకులు ఎన్ఐఏ ఆఫీసర్ల పేరుతో ద్విచక్ర వాహనంపై గత నెల 24 న స్థానిక అశోక్ నగర్ కు చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండ శంకర్ ఇంటికి వచ్చారు.
తాము ఎన్ఎస్ఐఏ అధికారులమని, మీకు ల్యాండ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని హెచ్చరించారు. పీఎఫ్ఐ సభ్యత్వం ఉందని, తాము తలుచుకుంటే ఎన్ కౌంటర్ కూడా చేయగలమని బెదిరించారు. తనకు ఎలాంటి భూ మాఫియా, పీఎఫ్ఐ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండ శంకర్ వేడుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో నకిలీ ఎన్ఐఏ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Also: OTT Updates: సూపర్ హిట్ ‘బింబిసార’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. !!
అలాగే పోచమ్మ వాడకు చెందిన సివిల్ ఇంజినీర్ గడ్డం వెంకటేశ్ ఇంటికి వెళ్లి, అక్కడా ఎస్ఐఏ అధికారులమని చెప్పి బెదిరింపులకు దిగారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరించడంతో నకిలీ ఆఫీసర్లు అక్కడి నుండి వెనుదిరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులిద్దరూ ఆదివారం రాత్రి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ కిశోర్ తెలిపారు. కొందరు నకిలీ ఆఫీసర్లుగా చెలామణి అవుతూ ముఠాగా ఏర్పడి పీఎఫ్ఐ తో సంబంధం ఉందని పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నకిలీ ఆఫీసర్లను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని విచారిస్తే ఎక్కడెక్కడ, ఎవరెవరిని బెదిరించారో వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు.
Read Also: Shimron Hetmyer: బద్దకంతో ఫ్లైట్ మిస్ అయ్యాడు.. టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు