Maoist Surrender : నిషేధిత సీ.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాల ప్రకారం, హన్మకొండ జిల్లా హసన్ పర్టి మండలం వంగపాడు గ్రామానికి చెందిన రూబెన్ 1979లో కాజీపేట ఆర్.ఈ.సిలో హాస్టల్ మెస్ విభాగంలో పనిచేసి, రాడికల్ యూనియన్స్ నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యారు. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పిలుపునందుకొని మావోయిస్టుల పంక్తిలో చేరారు.
1981 నుండి 1986 వరకు రూబెన్ నేషనల్ పార్క్ దళ కమాండర్ లంక పాపిరెడ్డి నేతృత్వంలో కుంట, బస్టర్ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. 1987లో పార్టీ నేతృత్వం అతనిని ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించింది. 1991లో అనారోగ్యం కారణంగా చికిత్స కోసం కొత్తగుడెం వెళ్తుండగా చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేసి జగదల్పూర్ జైలు తరలించారు. ఒక సంవత్సరం తర్వాత రూబెన్ మరో ముగ్గురు ఖైదీలతో కలసి జైలు నుండి తప్పించుకున్నారు. 1992లో తిరిగి మావోయిస్టు పార్టీ చేరి ఏరియా కమిటీ సభ్యుడిగా కుంట, అబుజ్ మడ్ ప్రాంతాల్లో 1999 వరకు పనిచేశారు.
KTR : మహిళలకు ఉచితం, మగవారికి భారం..? కేటీఆర్ ఫైర్
1999లో సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ (@రామన్న గోపన్న) నేతృత్వంలో బీజాపూర్ జిల్లా, గుండ్రాయి గ్రామానికి చెందిన పొడియం భీమేతో వివాహం జరిగింది. 2005లో డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ, అనారోగ్య కారణాలతో కూడా తన భార్య, పిల్లలతో గుండ్రాయి గ్రామంలోనే నివాసం కొనసాగించాడు. ఈ సమయంలో గ్రామ కమిటీలతో కలసి చురుకైన కార్యకలాపాలు కొనసాగించారు.
రూబెన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు, శరీరం ఉద్యమంలో పూర్తిగా సహకరించకపోవడం, మావోయిస్టు సిద్ధాంతాలపై కాలం చెల్లిపోయినట్లు భావించడం, ప్రజల్లో మావోయిస్టులపై వ్యతిరేకత పెరగడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రశాంత జీవన, పురావాస పథకాల ద్వారా కుటుంబంతో సుఖంగా జీవించాలనే ఆకాంక్ష కారణంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది అని సీపీ వివరించారు.
కుంట దళ సభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద కేవ్ వాల్, పండోడు, పిడిమాల్, బండారిపాడు గ్రామాల గ్రామస్తులను హత్య చేసిన ఘోర సంఘటనల్లో పాలుపంచుకున్నాడు. 1988లో గొల్లపల్లి-మారాయి గూడ మార్గంలో పోలీసుల కాన్వాయ్ పై దాడి చేసి 20 మంది సీఆర్‌పీఎఫ్ పోలీసులను హత్య చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గోపన్నతో కలిసి తుర్లపాడు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో పాల్గొన్నాడు.
పోలీస్ కమిషనర్ తెలిపారు, రూబెన్‌పై 8 లక్షల రూపాయల రివార్డ్ పెట్టి ఉంది. ఈ లొంగుబాటు సీనారియోలో రూబెన్ గతంలో చేసిన ఘోర నేరాలు, మావోయిస్టు ఉద్యమం వల్ల ఏర్పడిన పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి.
VC Sajjanar: చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. చేతిలో స్మార్ట్‌ఫోన్! చెల్లించక తప్పదు భారీ మూల్యం