ఈమధ్యకాలంలో ఈజీమనీ కోసం యువత పెడదారులు పడుతోంది. ఐపీఎస్ అధికారులు, పోలీసులు, కస్టమ్స్, ఐటీ అధికారుల పేరుతో అమాయకుల్ని అడ్డంగా మోసం చేస్తున్నారు. పోలీస్ డ్రెస్ లో వచ్చిన ఓ వ్యక్తి బెదిరించి విద్యార్థుల నుండి సెల్ ఫోన్స్ ఎత్తుకెళ్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం మొదలగూడెం స్టేజి సమీపంలో ఆగి ఉన్న ఎస్ కె పాషా అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఉండగా పోలీస్ డ్రెస్ లో వచ్చిన ఓ వ్యక్తి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటూ.. బెదిరించి అతని సెల్ ఫోన్ తీసుకున్నాడు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అంతే కాకుండా బైక్ పై ఎక్కించుకొని స్టేషన్ కి వెళదాం పద అంటూ మహబూబాబాద్ శివారుకు తీసుకొచ్చి సాలార్ తండా వద్ద దించి అక్కడినించి పరారయ్యాడు.. వచ్చిన వ్యక్తి నకిలీ పోలీసా అసలు పోలీస్ అని తెలియక విద్యార్థులు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లి తెలుసుకున్నారు. వారినుంచి సరైన సమాచారం లేకపోవడంతో విద్యార్థులు ముందుగా 100 కాల్ చేసి ఫిర్యాదు చేసారు.. అనంతరం సిరోలు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు ..
ఇదిలా ఉండగా మహబూబాబాద్ శివారు అనంతారం గుడికి వచ్చిన బయ్యారంకి చెందిన రాజెష్ అనే మరో విద్యార్థి నుండి కూడా పోలీస్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తి అతని సెల్ ఫోన్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటూ బెదిరించి స్టేషన్ కు వచ్చి ఫోన్ తీసుకుపో అంటూ వెళ్ళిపోయాడు. ఖాకీ డ్రెస్ లో వచ్చి సెల్ ఫోన్ తీసుకుపోతున్న వ్యక్తి ఎవరు నకిల్ పోలీసా? ఒరిజినల్ పోలీసా అనేది తెలియలేదు. ఒరిజినల్ పోలీస్ అయితే జిల్లా అంతటా సెల్ ఫోన్స్ ఎలా పట్టుకుపోతాడు.. ఈ విషయం పోలీస్ లు తేల్చాల్సిన అవసరం ఉంది. బాధితులు మాత్రం తమ సెల్ ఫోన్స్ తమకు ఇప్పించాలని కోరుతున్నారు.ఈ రెండు ఘటనలు సంచలనం రేపాయి.
Read Also: Cheater Arrest: యువతిని మోసం చేశాడు.. కటకటాల పాలయ్యాడు