Warangal Police: సీఐపై పోక్సో కేసు నమోదు.. మైనర్ బాలిక పై రేప్ అటెంప్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై దారుణానికి ప్రయత్నించిన సిఐ పై రేప్ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను కటకటాల వెనక్కి పంపించారు. సిఐగా పనిచేస్తున్న అధికారి ఓ వివాహాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఆవిడ కూతురిపైనే కన్నేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు సీఐ. దింతో బాధితురాలు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సదరు సిఐ పై కేసు నమోదు చేసింది. ఇదే స్టేషన్లోని సదరు సీఐ ఇదివరకు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Also Read: CSK vs RCB: తొలి మ్యాచ్ లో చెన్నై ఘన విజయం
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిఐగా పనిచేస్తున్న బండారు సంపత్ గత రెండు సంవత్సరాల క్రితం వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు చేపట్టారు. ఇదివరకే పెళ్లయిన అతను.. తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే వీరి మధ్య కొంతకాలం వ్యవహారం బాగానే నడిచిన ఆ తర్వాత బదిలీ అయి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రమోషన్ లో భాగంగా సిఐగా పోస్టు సంపాదించి భూపాల్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు.
Also Read: Moscow : మాస్కోలో భీకర ఉగ్రదాడి.. 60మంది మృతి, 140మందికి గాయాలు
ఈ కేసు పరంగా సిఐ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళలకు ఓ కూతురు ఉండగా తాజాగా ఆవిడ ఇంటికి సీఐ వెళ్లాడు. అయితే ఆ సమయంలో మహిళ కూతురు మాత్రమే ఉండడంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు సిఐ. అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ అమ్మాయిపై రేప్ చేయబోయాడు. అయితే ఆయన నుండి ఎలాగోలాగ తప్పించుకున్న సదరు బాలిక జరిగిన పూర్తి విషయాన్ని తల్లికి చెప్పుకోగా.. తల్లి సిఐని నిలదియడంతో ఆయన తిరిగి వచ్చి వారికి బెదిరింపులకు గురి చేశారు. తాను పోలీసు బలాలతో తనకి, తన కూతురికి ఇబ్బందులు గురి చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో భయభ్రాంతులకు లోనైనా తల్లి కూతుర్లు ఇద్దరు రెండు రోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు అందించారు. దింతో ఈ కేసు సంబంధించిన సీఐ సంపత్ పై రేప్ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఐను శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!