రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి. ఎక్కడ చూసిన కూలిన భవనాలు,…