దేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్ల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు కొందరు మద్దతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లకు జెడియు, టిడిపి, జెడిఎస్ వంటి పార్టీల మద్దతు ఇచ్చాయి. ప్రతిపక్ష కూటమి బిల్లుకు వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ అభివర్ణించింది. బిల్లును వ్యతిరేకిస్తామని ఎస్పీ చెబుతోంది. ఇలాంటి తరుణంలో తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టి, ఇది ఆస్తికి సంబంధించిన విషయమని అన్నారు. మేము బిల్లును విశాల దృక్పథంతో ప్రవేశపెట్టాము. ఈ బిల్లు మత వ్యవస్థలో జోక్యం చేసుకోదని అన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ, భోపాల్‌లోని ముస్లిం మహిళలు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ‘మోడీ జీ మీరు పోరాడండి.. మేము మీతోనే ఉన్నాము’ అంటూ నినదించారు.
Also Read:Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
ప్రతిపక్షాల నిరసన మధ్య ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి భిన్నమైన మద్దతు లభించింది. ఇక్కడ ముస్లిం మహిళలు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ముందుకు వచ్చారు. భోపాల్‌లో పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు ప్రధాని మోడీకి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని నినదించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘మోడీజీ మీరు పోరాడండి… మేము మీతోనే ఉన్నాము’ అని మహిళలు నినాదాలు చేశారు. ఢిల్లీలో కూడా ముస్లిం మహిళలు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ముందుకు వచ్చారు. మహిళలు ప్లకార్డులు పట్టుకుని.. వాటిలో ‘వక్ఫ్ ఆస్తి ఆదాయాన్ని దాని నిజమైన యజమానికి అందించినందుకు, వక్ఫ్ బోర్డులో మహిళలు, వెనుకబడిన ముస్లింలకు వాటా ఇచ్చినందుకు మోడీ జీ ధన్యవాదాలు’ తెలిపారు.
#WATCH | Madhya Pradesh: Women in Bhopal come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha. pic.twitter.com/CUaUA3Rtkh
— ANI (@ANI) April 2, 2025