Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఓటింగ్‌లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ని హ్యాక్ చేశాడని ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంల ఫ్రీక్వెన్సీని ట్యాంపరింగ్ చేయడం ద్వారా హ్యాక్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Maharashtra Election 2024: ఈరోజు (బుధవారం) ఉదయం 7గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
Jharkhand Election : జార్ఖండ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు అంటే బుధవారం ఓటింగ్ జరగనుంది. తొలి దశలో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక బుధవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు.
Loksabha Elections : మే 25న ఢిల్లీలో ఓటింగ్‌కు ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల రోజున ఢిల్లీలో దాదాపు 60 వేల మంది పోలీసులు భద్రత బాధ్యతలు చేపట్టనున్నారు.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఓటు వేసే ముందు బురఖా ధరించిన మహిళలను గుర్తించాలని ఆయన కోరారు.
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.