రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న రాజస్థాన్‌లో పోలింగ్ జరగనుంది. అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి కావడం గమనార్హం. అంటే ఆ రోజు రాష్ట్రంలో 50,000 కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉంది.
Karnataka Elections 2023: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ కి అంతా రెడీ అయ్యింది. దాదాపుగా 38 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఎలక్షన్స్ సాఫీగా సాగేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. రేపు అనగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటకలో పోలింగ్ జరుగుతుంది. 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతుంది. 2 వేల 615మంది…
ఐక్యరాజ్యసమితి వద్దన్నా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యాపై చర్యలకు దిగింది ఐక్యరాజ్యసమితి. రష్యాకు గురువారం మరో గట్టి షాక్ తగిలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుంచి రష్యాను బహిష్కరించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బయటకు పంపారు.…
ఏ ఎన్నికలు జరిగినా వంద శాతం పోలింగ్ అనేది చాలా అరుదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు వంద శాతం పోలింగ్ జరిగిన సందర్భాలు ఉండొచ్చు.. కానీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. రాజకీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. ఎన్నికల సంఘం ఎన్ని సూచనలు చేసినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే.. అయితే, ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంకు…