త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ... ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.
ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరో బాంబ్ పేల్చారు. ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం ఓట్లను తొలగిస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఢిల్లీ వేదికగా పెద్ద పోరాటమే చేపట్టారు. పార్లమెంట్‌లోనూ.. బయట నిరసనలు కొనసాగుతున్నాయి.
J&K Assembly Poll: జమ్ముకశ్మీర్‌లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పౌరులు "పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ"ను జరుపుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.
వచ్చే వారమే జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడు మూడు విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
జూలై 4న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల పోలింగ్ జూన్ 1న ముగిసింది. ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే రిజల్ట్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఆరు వారాల పాటు కొనసాగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. శనివారం ముగిసింది. కాగా.. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. మూడోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే రేపు (మంగళవారం) నేతల భవితవ్యం బయటపడనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
Warangal: వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.