దేశ వ్యాప్తంగా ఏడు దశల పోలింగ్ జరిగింది. చివరి విడత జూన్ 1న ముగిసింది. ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే రిజల్ట్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు నగరంలోని ఏడు స్థానాల్లో జరగనుంది. ఈశాన్య ఢిల్లీలోని ఐటీఐ నంద్ నగ్రిలో కౌంటింగ్ జరగనుంది. దీంతో ఉదయం 5గంటల నుంచే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గగన్ సినిమా టి-పాయింట్ నుంచి వజీరాబాద్ రోడ్డు (మంగళ పాండే రోడ్)లోని నంద్ నాగ్రి ఫ్లైఓవర్ వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
ఇది కూడా చదవంది: Israel: ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. లక్షద్వీప్ వెళ్లొచ్చంటూ పోస్టు
భోపురా సరిహద్దు, తాహిర్‌పూర్ టి-పాయింట్, గగన్ సినిమా టి-పాయింట్ నుంచి ట్రాఫిక్ మళ్లించబడుతుంది. ఇక వజీరాబాద్ రోడ్ (మంగల్ పాండే రోడ్) ఉదయం 5 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఇక తూర్పు ఢిల్లీ కౌంటింగ్ అక్షరధామ్‌లో జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి ఆ ప్రాంతంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పింది. అంతరాయం లేని ప్రయాణం కోసం.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మరియు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఇది కూడా చదవంది: EC: ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయండి.. లేదంటే..?