Warangal: వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వారిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదట పూర్తి కానుంది.
తొలిత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను గోదాం సంఖ్య 18c లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుల్ పై లెక్కించనున్న అధికారులు. ఏడు సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ పై 127 రౌండ్ లెక్కించనున్నారు. వరంగల్ బరిలో 42 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ శాతం 68.86.. మొత్తం ఓటర్ల సంఖ్య 18, 24,466 గాను ఇంకా 12,56,31 ఓట్లు నమోదయ్యాయి.
Read More: AP Election Results: బెట్టింగ్ బాబులకు ఎగ్జిట్ పోల్స్ టెన్షన్..
7 సెగ్మెంట్ల లెక్కించాల్సిన ఓట్లు టేబుల్స్ వివరాలు.
1. స్టేషన్ ఘన్పూర్: 290 పోలింగ్ కేంద్రాలు 2,00,158 నమోదైన ఓట్లు 17 టేబుల్ 18 రెండల్లో లెక్కించనున్న అధికారులు
2. పాలకుర్తి: 294 పోలింగ్ కేంద్రాలు 1,82,515 నమోదైన ఓట్లు 17 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
3. పరకాల: 239 పోలింగ్ కేంద్రలు 1,70,916 నమోదైన ఓట్లు 14 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
4. వరంగల్ పశ్చిమ: 244 పోలింగ్ కేంద్రలు 1,49,320 నమోదైన ఓట్లు 14 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
5. వరంగల్ తూర్పు: 230 పోలింగ్ కేంద్రలు 1,68,234 నమోదైన ఓట్లు 14 టేబుల్లో 17 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
6. వర్ధన్నపేట:278 పోలింగ్ కేంద్రలు 1,97,763 నమోదైన ఓట్లు 16 టేబుల్లో 18 రౌండ్లో లెక్కించనున్న అధికారులు
7. భూపాలపల్లి:317 పోలింగ్ కేంద్రలు 1,87,395 నమోదైన ఓట్లు 18 టేబుల్లో 18 రౌండ్లో అధికారులు లెక్కించనున్నారు.
Karimnagar: కరీంనగర్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం..