దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల ఐదో పోలింగ్ జరుగుతుంది.. ఈరోజు పలు పాంత్రాల్లో ఓటింగ్ మొదలైంది.. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బాలీవుడ్ ప్రముఖులు అంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వచ్చేసారు.. సామాన్యుల తో పాటుగా బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. ఐదో దశలో ఆరు రాష్ర్టాలు, రెండు…
తెలంగాణ లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సాదారణ ప్రజలతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చారు.. ఇప్పటికే చాలా మంది ప్రజలతో పాటే సమన్వయం పాటిస్తూ క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. అటు ఏపీలో కూడా 25 ఎంపీ,175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఉదయం…
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అర్హులైన ఓటర్లందరూ ఎన్నికల రోజున ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇండియన్ డెమోక్రసీ ఫెస్టివల్ – లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 తరపున, శ్రీ జయశంకర్ భూపలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఓటర్ల ఆసక్తిని పెంచేందుకు వినూత్న రీతిలో ఆహ్వానాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ముద్రించిన ఆహ్వాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఓటర్లందరూ…
చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని…
విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు కనిపిస్తారు.. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు.. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం.. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి..
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను వివరించేందుకు విజయవాడలో జరిగిన యువ ఓటర్ చైతన్య వేదిక కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ కాలేజీ పీఎస్సీఎంఆర్ కాలేజ్.. అందుకే ఇక్కడి నుండే ఈ పోగ్రాం మెదలుపెట్టానని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.