Sicily travel alert: యూరప్‌లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం విస్ఫోటనం చెందింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా ఆగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Ibu volcano: ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. హల్‌మహెరా ద్వీపంలో ఉన్న ఇబు అగ్నిపర్వతం మళ్లీ పేలింది. అగ్ని పర్వతం నుంచి బూడిద ఆకాశంలో 5కి.మీ వరకు ఎగిసిపడింది.
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రుయాంగ్ అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. బూడిద, పొగ 19 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటో ఆవరణకు చేరుకుంది. సునామీ భయం పుట్టింది. 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజాగా ఇండోనేషియాయలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికీ సంబంధించిన సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. ఇక ఈ అగ్నిపర్వతం గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 5 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ విషయాన్ని ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ విస్ఫోటనంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇక అక్కడి పరిస్థితులను అంచనా వేసిన అధికారులు అక్కడ…
Shiveluch Volcano Erupts: రష్యాలో షివేటుచ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ప్రపంచంలో అత్యంత చురకైన అగ్నిపర్వాతాల్లో షివేటుచ్ ఒకటిగా ఉంది. ఇది మంగళవారం పేలినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలోని ఈ అగ్నిపర్వతం భారీ ఎత్తున బూడిదను వెడజల్లుతోంది. పేలుడు తర్వాత బూడిద ఆకాశంలో చాలా ఎత్తు వరకు వ్యాపించింది. అర్థరాత్రి తర్వాత విస్పోటనం చెంది సుమారు 6 గంటల వరకు యాక్టివ్ గా ఉందని రష్యా తెలిపింది.
Indonesia's Merapi Volcano Erupts: ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీని ప్రభావంతో ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఆ దేశా వివత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇండోనేషియాలోని యొగ్యకర్తా ప్రాంతంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విస్పోటనం చెందింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కార్యకలాపాలు నిలిపివేయాలని…
Volcano Erupts In Indonesia, Possibility Of Tsunami: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైంది. జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్ధలైంది. 1.5 కిలోమీటర్ల మేర బూడిదను గాలిలోకి ఎగిసిపడింది. విస్పోటనం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు సూచించారు. అగ్నిపర్వతం నుంచి వస్తున్న లావకు దూరంగా ఉండాలని తెలిపింది.