తాజాగా ఇండోనేషియాయలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికీ సంబంధించిన సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. ఇక ఈ అగ్నిపర్వతం గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 5 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ విషయాన్ని ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ విస్ఫోటనంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇక అక్కడి పరిస్థితులను అంచనా వేసిన అధికారులు అక్కడ సునామీ హెచ్చరికలను జారీ చేసారు.
Also Read: Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్!
ఇందులో భాగంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేసారు అధికారులు. అగ్నిపర్వతం నుండి వెలబడుతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత లావా పెద్ద ఎత్తున సమీప ప్రాంతాలకు చేరడంతో దేశ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇక 725 మీటర్ల పొడవు ఉన్న రుయాంగ్ అగ్నిపర్వతం నుండి ప్రజలు సుమారు 6 కి.మీ. మేర దూరంగా ఉండాల్సిందిగా ఉండాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మేరకు స్థానికులకు పలు సూచనలు చేస్తూ.. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
Also Read: Nominations in Telugu States LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. లైవ్ అప్‌డేట్స్
ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలోకి కూలిపోవడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలోని దాదాపు 11 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే.
Whatsapp Image 2024 04 18 At 12.38.06 Pm