Pydithalli Sirimanu Utsavam 2024: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆహ్వానించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు.. నేడు భారతదేశ పార్లమెంట్ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసినట్టు వెల్లడించారు.. కాగా, అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలు నిర్వహించనున్నారు.. పైడితల్లి ఉత్సవాలకు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, దేశ విదేశాల నుండి ఈ మహోత్సవాలకు అమ్మవారి భక్తులు వస్తారని, అలాంటి విశిష్టత కలిగిన మహోత్సవాలకు తప్పనిసరిగా రావాలని స్పీకర్ ని ఆహ్వానించినట్టు ఎంపీ కలిశెట్టి తెలిపారు.. ఈ సందర్భంగా తిరుమల నుండి తీసుకెళ్లిన శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఓం బిర్లాకి అందించినట్టు వెల్లడించారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
Read Also: Amit Shah: 6 కోట్ల మంది ప్రజలు మావోయిస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు..